పండగ అంటే

(23)
  • 696
  • 1
  • 255

,"ఏమండీ? పండగ వస్తుంది. గుర్తు ఉందా?" అని  టీ అందిస్తూ అంది శ్యామల."మరిచిపోవడానికి అది ఏమైనా చిన్న పండగా. పెద్ద పండుగ.  ఖర్చుతో కూడిన పండగ కదా! అందుకే పెద్ద పండగ అన్నారు అనుకుంటా!" అని పెదవిపై రాని నవ్వు నవ్వుతూ టీ అందుకున్నాడు శంకర్."ఏమిటా మాటలు. పిల్లలు అందరూ ఇంటికి వచ్చి సరదాగా గడిపి వెళ్ళతారు. దానికే ఖర్చు అనుకుంటే ఏలా?" అని కొంచెం కోపంగా అంది కానీ తనకి తెలుసు ఇంటిలో పరిస్థితి బాలేదు అని. అలా అని పండగకి పిల్లలను రావద్దు అని అనలేము కదా! "నిజమే సరదాగా గడిపి వెళ్ళతారు. కానీ వాళ్ళ అచ్చట ముచ్చట తీర్చాలి కదా! ఎంత లేదు అన్న ఇద్దరి అల్లుళ్లకి  ఏదో కొంత ఇవ్వాలి, పిల్లలకి, వాళ్ళ పిల్లలకి బట్టలకి ఇవ్వాలి. చేతిలో పైసా లేదు  ఏమి చేయాలి అని ఉదయం నుండి ఆలోచిస్తున్న" అని విచారంగా అన్నాడు."నిజమేనండి, ముందే చెప్పారు పిల్లలు.