అర్జున్ హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండి ఇంటర్ చదివే రోజులు అవి..డైలీ కాలేజ్.. అది అవ్వగానే హాస్టల్ కి వచ్చి తన ఫ్రెండ్స్ తో కబుర్లు..కాలక్షేపానికి వారానికి ఒక సినిమా.. అదే అతని జీవితం..రోజు లాగానే కాలేజ్ కి వెళ్ళే హడావిడిలో ఉండగా అర్జున్ ఫోన్ రింగ్ అయ్యింది..ఎవరా అని చూడగా స్క్రీన్ మీద నాన్న అని కనిపించగానే ఆతృతగా కాల్ లిఫ్ట్ చేసి పలకరించ్చాడు.అక్కడ నుంచి ఎలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలు అడిగి వచ్చేవారం ఊర్లో జాతర ఉందని చెప్పి స్నేహితులతో కలిసి ఊరికి రమ్మని చెప్పాడు తండ్రి.తండ్రి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక అప్పటికి అప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి సరే నాన్న అని చెప్పాడు అర్జున్.అర్జున్ సరే అనగానే కాల్ కట్ అయిన శబ్దం వచ్చింది..అర్జున్ ను గమనిస్తున్న అతని ఫ్రెండ్స్ అతని మొహం లో దిగులు చూసి ఏమైంది అంటూ అడిగారు.ఊర్లో