చూస్తూ వుండగానే ఎండాకాలం సెలవులు అయిపోయినాయి.నేను 5 వ తరగతిలోకి అడుగు పెట్టాను.ఆ సంవత్సరం వర్షం కాలం మెదటి నెలలో చాలా వర్షాలు పడ్డాయి ...అయితే ఒక రోజు అమ్మ వాళ్ళు గోదావరి నది లోనే పని చేస్తూ వున్నారు... ఆప్పుడు మధ్యానం 1 గంట అవుతుంది ..పని దిగి అందరు అన్నం తినాలి అని అనుకున్నారు..అన్నం తినడం కోసం నీళ్ల కోసం అమ్మ నీళ్ల క్యాన్ తీసుకొని నీటి చేలిమ దగ్గరకు వెళ్ళింది.అమ్మ మురికి నీటిని తీసి పడపోసి తేట నీళ్లు రాగానే చెబ్బు తో క్యాన్ లో పోసుకుంటుంది..అమ్మ చూస్తూ వుండగానే చెలిమా లోని నీళ్లు అన్ని ఒకసారిగా మురికిగా అయిపోయాయి. ఎంటి ఇలా అయిపోయాయి నీళ్లు అని అనుకుంటుంది అమ్మ ..అమ్మ మురికి నీళ్లు అన్నీ పారబోస్టు వుంది కానీ తెల్లటి నీళ్లు రావడం లేదు.అమ్మకు ఏం అర్థం కాలేదు..రోజు బాగానే వచ్చేవి ఈరోజు ఏమయింది అని