చేసింది ఎవరు ?

  • 192
  • 63

చేసింది ఎవరు…?  రాత్రి సరిగ్గా 12:00 గంటలు... మంచి నిద్రలో ఉన్న మౌనిక ఫోన్‌కి ఒక కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. "Happy Birthday Sweetheart..." ఆ తర్వాత వరుసగా మరికొన్ని మెసేజ్‌లు. ఉలిక్కిపడి లేచిన మౌనిక ఫోన్ చూసింది. "అదేంటి, ఇవాళ నా పుట్టినరోజు కాదు కదా? మరి ఈ మెసేజ్‌లు ఎవరు, ఎందుకు పంపిస్తున్నారు?" అని విసుగ్గా అనుకుని, ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి మళ్ళీ పడుకుంది. పొద్దున లేచి చూసేసరికి ఫోన్‌లో 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అన్నీ కొత్త నంబర్లే. "ఎవరీ కొత్త నంబర్లు? ఎందుకిలా డిస్టర్బ్ చేస్తున్నారు?" అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి, కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతుండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే ఎదురుగా ఇద్దరు పోలీసులు. "ప్రకాష్ ఎక్కడ?" అడిగాడు ఇన్‌స్పెక్టర్. "ప్రకాష్? ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు," అంది మౌనిక అయోమయంగా. "తెలీదా? అతని