అఖిరా – ఒక ఉనికి కథ - 5

  • 87

ఆ రాత్రంతా అఖిరా నిద్రపోలేక అలాగే ఆలోచిస్తూ కూర్చుని ఉండిపోయింది.“ఎలా అయినా రేపు చెక్ దొరికితే సరిపోతుంది… అంతా బాగుపడుతుంది,” అని మనసులోనే అనుకుంది.---తర్వాత రోజు ఉదయం సత్య అఖిరాకు ఫోన్ చేసింది.“హలో అఖిరా,” అని పిలిచింది.“హా సత్య, చెప్పు,” అంది అఖిరా.“నేను కిషోర్‌తో మాట్లాడాను. ఆఫీస్ అడ్రస్ దొరికింది. నీకు వాట్సాప్ చేశాను.పది గంటలకు సర్ ఆఫీస్‌లో ఉంటారట. నువ్వు వెళ్లి మాట్లాడితే చెక్ ఇస్తారట,” అని చెప్పింది.అఖిరా వెంటనే,“సరే. నేను వెళ్తాను,” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.---కొద్దిసేపటికి అఖిరా ఆఫీస్ ముందు నిలబడింది.బోర్డుపై పెద్ద అక్షరాల్లో — ‘Gokulnanda Industries’ అని రాసి ఉంది.లోపలికి వెళ్లి,“ఎక్స్క్యూజ్ మీ… I'm Akhira మిస్టర్ గోకుల్‌నంద గారిని కలవాలి,” అని రిసెప్షనిస్టుకు చెప్పింది.“ఒక నిమిషం,” అని ఆమె చెప్పి కాల్ డయల్ చేసింది.“సర్, అఖిరా అని ఒక అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చారు,” అని చెప్పగానే,అటువైపు నుంచి, “లోపలికి పంపించండి,” అని