అనగనగ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వారు ఇద్దరూ ఈ ప్రపంచంలో పుట్టింది ఒకరి కోసం ఒకరని చెప్పుకోవచ్చు. కానీ ఆ విషయం వారికి తెలియదు.ఆ అబ్బాయి చదువును పూర్తి చేసి అమరావతిలో ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. తన కష్టపడి సాధించిన విజయంతో కుటుంబానికి గర్వకారణం అయ్యాడు. అదే సమయంలో ఆ అమ్మాయి కూడా తన చదువును పూర్తి చేసి, ఒక ఉద్యోగం సంపాదించింది. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగుతూ ఉన్నారు.కానీ విధి వింత. ఒక రోజు సోషల్ మీడియా యాప్‌లో వీరి పరిచయం మొదలైంది. మొదట్లో చిన్న చిన్న మాటలతో ప్రారంభమైన సంభాషణ, క్రమంగా లోతైన అనుబంధంగా మారింది. అబ్బాయి తన ఆలోచనలను, తన కలలను ఆమెతో పంచుకున్నాడు. అమ్మాయి కూడా తన మనసులోని భావాలను, తన ఆశయాలను అతనితో చెప్పింది.రోజులు గడుస్తున్న కొద్దీ వారి మధ్య బంధం మరింత బలపడింది. ఒకరి కోసం ఒకరు