దుర్యోధనుడు ఏంటి మామ వీడిని చంపడానికి నువ్వు వెళ్లాలా నేను చూసుకుంటా అంటూ రుద్రుడి దగ్గరికి చేరుకుంటాడురుద్రుడు వర్సెస్ దుర్యోధనుడు: బాణ యుద్ధంఅప్పుడే 'టింగ్ టింగ్' అంటున్న ఒక శబ్దం వినిపిస్తుంది. రుద్రుడు, దుర్యోధనుడు మరింత గట్టిగా కొట్టుకుంటున్నారు. మామ శకుని చెప్పినా కానీ వినకుండా దుర్యోధనుడు తన చేతిలో బాణం పట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. హనుమంతుడి శిష్యుడైన రుద్రుడికి గద ఒక్కటే కాదు కదా? యుద్ధం చేయాలంటే ఒక చిన్న గడ్డిపరకతో కూడా యుద్ధం చేయగలడు. అలాంటిది అతడు బాణం, విల్లు తీసుకున్నంత మాత్రాన రుద్రుడు మాత్రం తగ్గుతాడా? తన చేతిలో ఉన్న గదను ఒక్కసారిగా పైకి ఎగరేసి మరోసారి "జై ఆంజనేయ!" అని అనగానే, తన చేతిలో పడిన గద కూడా ఇప్పుడు విల్లు, బాణంలా మారిపోయాయి. ఇప్పుడు ఇద్దరూ బాణాలతో యుద్ధం చేస్తున్నారు. రుద్రుడి చేతి నుంచి వచ్చే ప్రతి ఆయుధం ఎంతో శక్తివంతంగా ఉంది. దుర్యోధనుడు