భూముల విలీనం: శకుని విజయం, ప్రజల జ్ఞానోదయంయుద్ధభూమిలో, భూములన్నీ పూర్తిగా కలిసిపోయే సమయం ఆసన్నమైంది. ఐదు రకాల భూముల మధ్య ఉన్న ఆ నల్లటి బ్లాక్ ఎనర్జీ నెమ్మదిగా అన్నిటినీ ఒక చోటికి చేరుస్తోంది. ఒకరి శరీరంలోకి ఒకరు వెళ్ళినట్టుగా, ఐదు భూములు ఒక్కొక్కటిగా ఒకదాంట్లోకి ఒకటి వెళ్లడం మొదలుపెట్టాయి. ఆ దెబ్బకు భూమి అల్లకల్లోలం అవుతూ, ప్రజలు కళ్ళు తిరిగి పడిపోయే స్థాయికి చేరుకున్నారు. అగ్నిపర్వతాలు ఉప్పొంగి పడిపోతూ ఉండగా, సముద్రాలు పొంగిపోతున్నాయి.ఒక్కసారిగా ఐదు రకాల భూములు కలిసిపోవడంతో, ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురుచూస్తున్నట్టుగా అందరూ మోకాళ్ల మీద పడ్డారు. పైన ఎగురుతున్న శకుని వాళ్ళందరినీ చూస్తూ, "ఇప్పటికి ఒప్పుకున్నారు! మీ అందరినీ ఒప్పించడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను! ఇప్పటి నుంచి కలియుగ రాజకీయమంటే ఏంటో చూపిస్తా! చావండి!" అని అంటూ గట్టిగా నవ్వుతున్నాడు.ఒక్కసారిగా ఏదో జరుగుతుంది. చుట్టూ వెలుగు పరుచుకుంటుంది. వెలుగు పడిన ప్రతిచోట నెగటివ్