మనిషి నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో సమస్యలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. సరిగ్గా ఆలోచిస్తే లేదా సరిగ్గా చూస్తే ప్రతి ప్రశ్నకు జవాబు, ప్రతి సమస్యకి పరిష్కారం మన చుట్టుపక్కలే ఉంటుంది కానీ చాలామంది పరిష్కారాన్ని వెతకడంలో విఫలం అవుతూ ఉంటారు. ఇలా విఫలం అయ్యే క్రమంలో తన పైన తనకు పట్టుదల కోల్పోయి హంతకులుగా మారడం లేదా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడము లేదా చెప్పుడు మాటలుకి లోనవ్వడం జరుగుతూ ఉంటాయి. మనసు నియంత్రణ అనేది ఈ సమాజంలో నేటి కాలానికి ప్రతి మనిషి తప్పక పాటించాల్సిన ఒక నియమంలో ఉండాలి ఉండి తీరాలి.ఇది ఒక సమాజం ఇక్కడ ఇలాగే బ్రతకాలి అని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈ నియమ నిబంధనలని పాటించకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా బతికే వారు కూడా ఉన్నారుఎలాగైనా బ్రతకాలి అని నియమాలు అడవిలో ఉంటాయి…. ఇలాగే