నిజం - 4

4వ - భాగం సికింద్రబాదు నగరం, హబ్సిగూడ లో రాత్రి 10 గంటలకి ఓ ఇంటి డోర్ బెల్ మొగింది.ఆ ఇంట్లొ ఉన్న వ్యక్తి వచ్చి "ఈ సమయంలొ ఎవరై ఉంటారా" అని తలుపు తీసాడు.తెలుపు తెరవగానె ఎదురుగా తన స్నేహితుడు నించోని ఉండడం చూసి"ఒరెయి సురేష్ నువ్వా? ఎంట్రా ఇంత సడన్ గా? అది రాత్రి పూట? లోపలికి రా."సురేష్ : ఏరా సూర్య ఎలా ఉన్నావు?సూర్య : నేను బానె ఉన్నాను రా. కాని నువ్వేంట్రా ఇంత సడన్ వచ్చావు? వస్తున్నావని కనీసం ఫోను అయిన చెయ్యలేదు.? అవును నీకు నిశ్చితార్దం అన్నావు కదా రా మరి పెళ్ళి ఎప్పుడు?సురేష్ : వైజాగ్ లొ చిన్న సమస్య రా దాని వల్ల ఆ నిశ్చితార్దం కూడా ఆగిపోయింది. అందుకె కొన్ని రోజులు నీ దగ్గర ఉందామని వచ్చాను. నీకు ఏం అబ్యంతరం లేదుగా?సూర్య : నాకేం అబ్యంతరం లేదులే రా.