ఓపెన్ చేస్తే... అర్ధరాత్రి పండు వెన్నెల టైంలో... అలా నిండు చంద్రుడిని... అలా ఒక ఇంటి గది కిటికీ లోపల నుంచి వస్తే.... ఆ గదిలో కొన్ని వస్తువులు.. బట్టలు... చిందర వందరగా పడి ఉంటాయి...! అలా బెడ్ పై చూపిస్తే, ఒక ఆమె 27+ బోర్ల పడుకుని... ఏడుస్తూ ఉంటుంది...! అప్పుడు కిటికీలో నుంచి గాలి ఎక్కువగా వీస్తుంది... దాంతో ఆమె తల దగ్గర ఉన్న డైరీ పేజీలు.. (ఇది తనేదే) అలా గాలికి ఊగుతాయి...! అప్పుడు ఆమె చేయి, ఒక పేజీ పై పెడుతుంది... అప్పుడు డైరీలో చూస్తే.. ఆ మాటలు ఇలా ఉంటాయి..!డైరీలో మాట ; మనల్ని అసహ్యించుకునే వాళ్లతో ఉండే జీవితం.... నరకం...!! (సాడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొంచెం గ్యాప్ ఇచ్చి) డైరీలో ; ఆడదానిగా పుట్టినందుకు మన కర్మ ఇంతే అనుకుని భరించాలా..?అమ్మ నాన్న పెళ్లి చేశారని వాళ్ళ కోసం సహించాలా...??సొసైటీ ఏదో అను