కొత్త పాత్రల ప్రవేశం: విశ్వసేన, భీముడుఇలా అనుకుంటూ ఉండగానే, "సరే, ఇప్పుడు రావాల్సిన వాళ్ళు వస్తున్నారు చూడు," అని అంటూ ఒక టెలిపోర్ట్‌ను ఓపెన్ చేస్తాడు. అక్కడి నుంచి కొంతమంది యోగులు, సిద్ధులు, అఘోరీలు, వారికి ముందుగా బలమైన వజ్రకాయతో ఉన్నట్టుగా లావుగా కనిపిస్తున్న వ్యక్తి వస్తున్నాడు. అతను వచ్చి రావడంతోనే అసురులను అతలాకుతలం చేస్తున్నాడు. సడన్‌గా అతని చేతిలోకి గద వచ్చింది. ఆ గదతో ఊంచి పడేస్తుంటే అసురులు అంతమైపోతున్నారు. అతను స్పీడుగా వెళ్తూ, "అర్జున్! అర్జున్ అన్నయ్య! ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నావు? నిన్ను ఏం చేశారు?" అని అంటూ గదతో అసురులను నలిపేస్తున్నాడు. అడ్డొచ్చిన వాళ్ళను తొక్కి పడేస్తున్నాడు.కొద్దిసేపటికి అర్జున్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ కొన్ని గద్దలు ఎగురుతూ ఉండగా, "ఏంటి, మా అన్నయ్యని చంపాలని చూస్తున్నారా? ఎంత ధైర్యం వీళ్ళకి! నా గురించి తెలియదు అనుకుంటా!" అని అంటూ ఒక్కసారిగా గదతో కొట్టేసరికి, అక్కడున్న బ్లాక్ ఎనర్జీ