అంతం కాదు - 53

  • 192

విక్రమ్,  ఆ లాకెట్‌ను చూడగానే, "ఇది ఎక్కడ చూసినట్టుంది?" అని ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు. "అవును, ఇది అశ్వత్థామది కదా?" అని విక్రమ్ అడిగాడు. "అవును" అని అర్జున్ అన్నాడు. "చూద్దాం" అని అనుకుంటూ, "అవును విక్రమార్క, నా పేరు అర్జున్, మా అన్నయ్య విక్రమ్. ఇద్దరి పేర్లు ఒకేలా ఉన్నాయి కదా?" అని అర్జున్ అన్నాడు. "అవును, మనం ఎక్కడున్నాం?" అని విక్రమార్క అడిగాడు. "మనం భూమ్మీదే కదా ఉన్నాం?" అని అర్జున్ అన్నాడు. "లేదు, నాది కదా భూమి" అని విక్రమార్క మాట్లాడుతూ అన్నాడు. వాళ్ళందరూ "కాదు, మాది అంటే మాది భూమి" అని అన్నారు. పైనుంచి చూస్తున్న హనుమంతుడు గట్టిగా నవ్వుతూ ఒక కోతి పిల్లగా మారి వాళ్ళందరినీ ఒకచోటికి చేర్చాడు. అందరూ ఒకరినొకరు చూసుకుంటూ, "ఏంట్రా? ఎవర్రా మీరు అంతా? ఇదేం మాయాజాలమా?" అని విక్రమార్క అంటుండగా, "ఆగు" అని హనుమంతుడు వాళ్ళ కథలన్నీ చెప్పాడు.