నా జతకాగలవా?! - 1

  • 120

రాత్రి 11:30 అవుతుండగా మబ్బులు పట్టిన ఆకాశం కురవనా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా ఉంటే... నీకోసమే వేచి చూస్తున్నాము అన్నట్టుగా చెట్లన్నీ ఊగుతూ హోరుగా వీస్తుంది గాలి...దట్టమైన మబ్బుల మధ్యన దాగుతూ బయటపడుతూ వెన్నల దోబూచులాడుతుంటే ఆ వెన్నల వెలుగుకి,గాలికి లేత ఆకులు మెరుస్తూ వన్నెలుబోతున్నాయి....ఆ సొగసును తాకడానికి ఇక ఆలస్యం చేయలేను అన్నట్టు వర్షపు బిందువొకటి నేల రాలి లేలేత ఆకు మీద గర్వంగా నిలవగా... ఆ వెనకే జోరుగా మొదలయ్యింది వర్షం...ఎంత అందమైనదో ప్రకృతి...!!కాని ఆ అందాన్ని ఆస్వాదించే పరిస్థితుల్లో లేని అతను... ఛ.. నా కర్మకు ఈ వర్షమోక్కటే తక్కువయ్యింది అని తిట్టుకుంటూ బైక్ ఒక పక్కన ఆపి పెద్ద చెట్టు కింద నిలబడి ఫోన్ చూసుకోగా అది కాస్త బాటరీ డెడ్ అయ్యి కనిపిస్తుంది...విసుగుతో దాన్ని విసరబోయి చివరి క్షణం లో పాంట్ ప్యాకెట్ లో దోపుకుని టైమ్ చూసుకుంటాడు...వీడి సర్ప్రైస్ తగలయ్య... ఇప్పుడు వీడిని