మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 4

  • 135

నాన్న చాలా మంచి వాడు.. చిన్నపటి నుంచి మమల్ని ఎంతో ప్రేమ గా పెంచాడు.మేము ఏమి అడిగిన..కాదు అనకుండా  తనకు వున్న దాంట్లో మమ్మల్ని ప్రేమ గా చూసుకొనే వాడు.ప్రతి పండుగకు అక్కకు,నాకు కొత్త బట్టలు కొనిచేవాడు.మా అన్నలు ,అక్కలతో పోలిస్తే మా జీవితాలు చాలా మంచిగా వుండేవి.కానీ నాన్న కొంచం మా భవిషత్తు గురించి భయ పడ్డాడు.అందుకే నాన్న అక్కను పనికి  పెట్టాడు.అక్క కూడా నాన్న మాటకు అడ్డు చెప్పకుండా పనికి వెళ్ళేది.అక్క కూడా తెలుసు ..మాకు ఒక అన్న వుంటే నాన్న కు బరువు బాధ్యతలలో  తోడుగా వుండే వాడు అని..అందుకే నాన్నకు కొడుకు లేకున్నా నేనే పెద్ద కొడుకును అయ్యి తనకు సాయం చేయాలి అని అక్క అనుకొని ...పనికి వెళ్ళేది.అప్పుడు అక్కకు కేవలం 13ఏళ్లు మాత్రమే అయిన పేద్దవారికి సమానంగా పని చేసేది.అక్క మగ వాడిలా ..మగ వారికి సమానంగా పని చేసేది.అందరు అక్కని.. పని