అంతం కాదు - 50

  • 117

ఆ తర్వాత బుజ్జమ్మ విక్రమ్‌ని చూసి, "నా పని పూర్తయింది, మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు," అని అంది. బుజ్జమ్మ మనసులో, "ఇతనికి తన గతం గుర్తుకొస్తున్నట్లుంది," అనుకుంది. తర్వాత, "సరే, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం," అని చెప్పి మళ్ళీ ఆ టవర్‌పైకి ఎక్కి కూర్చుంది.కొద్దిసేపటికి అర్జున్ పైకి లేస్తాడు. తన తమ్ముడి మీద ఏదో పడిందని, తన శవం కూడా దక్కదని అనుకుంటూ అర్జున్ విక్రమ్ వైపు చూస్తాడు. విక్రమ్ శరీరం మీద పెద్ద దెబ్బ తగిలింది, కానీ అది చావు నుంచి బ్రతికించే దెబ్బ. మళ్ళీ శవం దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. తను గుక్క పెట్టి ఏడుస్తూ ఉండగా, కన్నీళ్లు విక్రమ్ శరీరం మీద పడతాయి. విక్రమ్ శరీరం మీద ఉన్న బంగారు రంగు ఇంకాస్త పెరుగుతూ, ఆ దెబ్బ తగిలిన చోటు నుంచి గుండెల మీదుగా కింద కాళ్ల పైకి, పైన తల అంతా చుట్టుకుంటూ ఏదో