అంతం కాదు - 49

  • 183

"ఏంట్రా వీడు ఇలా పరిగెడుతున్నాడు? నన్నేమో అంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు!" అని బుజ్జమ్మ గట్టిగా నవ్వుతూ, "కావాలి! నన్నే బంధిస్తాడా? కొద్దిసేపు ఆడుకుందాం!" అని అనుకుంటుండగా, విక్రమ్ కొద్దిసేపటికి తేరుకున్నాడు. తన చేతిలోకి బాణం వచ్చింది. అక్కడ ప్రకృతి శక్తులు పెద్దగా కనిపించకపోవడంతో నెగటివ్ ఎనర్జీ లోకి ఆ శక్తి ప్రవహించింది. ఆ నెగటివ్ ఎనర్జీతో బాణం తయారు చేసి తన విల్లుతో వేయడం మొదలుపెట్టాడు. అటు ఇటు ఎగురుతూ ప్రతి ఒక్క అసురుని చంపడం మొదలుపెట్టాడు. బీజాసురుడు మరింత బెదిరిపోయాడు.ప్రదేశం: యుద్ధభూమిలోవెంటనే అక్కడున్న అర్జున్, "ఇదిరా! ఇదిరా నా తమ్ముడు అంటే!" అని గర్వంగా రొమ్ము విరిచి మాట్లాడుతుంటే, బుజ్జమ్మ, "నీ తొందర ఆపు! లేదంటే నీ కథ ఇప్పుడే మొదలు పెట్టాల్సి వస్తుంది!" అని అంది.బీజాసురుడు చూస్తున్నాడు. "వీడిని ఇలా వదిలేస్తే నిజంగానే చంపేస్తాడే ఎలా ఉన్నాడు!" అని అంటూ నెగటివ్ ఎనర్జీలో కలిసిపోయాడు. ఆ ఎనర్జీ నుంచి