బతుకమ్మ మరియు దసరా హాలిడేస్ ఇవ్వడం తో మా పిల్లలు ఎంతో సంబర పడుతున్నారు .ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి పోవాలి అనీ..ఈరోజె స్కూల్ లో హాలిడేస్ ఇచ్చారు ..స్కూల్ నుంచి రాగానే " మమ్మీ " అంటూ స్కూల్ బ్యాగ్ పక్కకు పడేసి నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటున్నాడు."అమ్మ.. రేపటి నుంచి నాకు స్కూల్ లేదు ..రేపు అమ్మమ్మ ఇంటికి పోవుడే అంటున్నాడు."దానితో "నేను రేపు కాదు డాడీ 3,4 రోజుల తరువాత పోదాం .." "ఇప్పుడు పోదాం అంటే నాన్న మనల్ని పంపించాడు.. ఎందుకంటే పండుగ ఇంక చాలా రోజులు వుంది. మళ్ళీ నాకు బావి దగ్గర కూడా పని వుంది ..ఇప్పుడే పోతే బావి దగ్గర చెలక పని ఎవ్వరూ చేస్తారు డాడీ" అని అన్నాను ."లేదూ రేపే పోదాం ఆటు" మారం చేస్తున్నాడు.నా 6 సంవత్సరాల కొడుకు కు ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు."లేదు రేపు పోదాం"