చేతి మచ్చ – ఒక జీవితం

"ఆ వాన రాత్రి – 12 సంవత్సరాల క్రితం"2013, ఆగస్టు నెల. మాచర్ల పట్టణం. ఆ రాత్రి వాన బాగా పడుతోంది. విద్యుత్ పోయింది. చీకటి, చలికి కలిసిపోయిన ఆ సమయం. అప్పుడే ఇంటి గుమ్మం దగ్గర ఓ చిన్న పిల్లోడు—రమేష్, ఏడేళ్ల వయస్సు. తడి బట్టలతో, భయంతో, ఆకలితో, కూర్చొని వున్నాడు.అయితే,  అతన్ని చూసిన శాంతమ్మ, ఓ వృద్ధ మహిళ, తలుపు తెరిచి లోపలికి తీసుకెళ్లింది. "ఏమయ్యా, ఎవరు నీవు? ఎక్కడినుండి వచ్చావు?" అని అడిగింది. రమేష్ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు, "అమ్మ నన్ను బస్ స్టాండ్ దగ్గర వదిలేసింది. తిరిగి రాలేదు..."శాంతమ్మ గుండె గుబులైంది. తనకు పిల్లలు లేరు. కానీ ఆ చిన్నారి ముఖంలో ఏదో తన జీవితాన్ని చూసింది. ఆ రాత్రి వంటచేసి, తడి బట్టలు మార్చి, అతనికి ఓ తల్లి ప్రేమను ఇచ్చింది.ఆ సంఘటన తర్వాత రమేష్ శాంతమ్మతోనే ఉండిపోయాడు. ఆమె అతనికి చదువు చెప్పించింది,