కళింగ రహస్యం - 3

  • 1.2k
  • 513

Part - III ఆ రోజు రాత్రి అందరు పడుకున్నాక వంశి నెమ్మదిగా బయటకి వచ్చి ఊరి చివరన ఉన్న మఱ్ఱి చెట్టుకు వద్దకు బయలుదెరుతాడు.ఊరు పొలిమేర దాటాక చీకటి గా ఉండడంతొ తాను తెచ్చుకున్న టార్చ్ లైట్ (torch light) వెలిగిస్తాడు.టార్చ్ లైట్ (torch light) వెలిగించగానె ఎవరొ నడుచుకుంటు వెళ్ళడం చూస్తాడు. ఎవరా అని చూస్తె ఆ ఊరి షావుకారు రామ్మోహన్. తన పై టార్చ్ లైట్ (torch light) వెలుతురు పడిన పట్టించుకోకుండా ఎటో చూస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు. "రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు" అని వంశి ఎంత పిలిచిన పట్టించుకోకుండా ఊరి చివర మఱ్ఱి చెట్టు వైపు కు నడుచుకుంటు వెళుతున్నాడు.అది గమనించిన వంశి తన వెనకే వెళతాడు. ఇద్దరు మఱ్ఱి చెట్టుక వద్దకు చేరుకుంటారు. రామ్మోహన్ అలా మఱ్ఱి చెట్టు వంక చూస్తూ నించుటాడు. వంశి కొంచెం దూరంలొ నించోని అదంతా గమనిస్తున్నాడు. కొంచెం సేపటికి ఆ మఱ్ఱి