అధూరి కథ - 5

  • 297
  • 129

జ్యోతి ని తీసుకుని కోపంగా వెళ్తున్న అర్జున్ దగ్గరకి కౌసల్య, ప్రియ తో పాటు అందరూ పరిగెత్తుకుని వెళ్తారు. ప్రియ అర్జున్ ని ఆపడానికి try చేస్తుంటే, అర్జున్ కోపంగా "ప్రియ పక్కకి తప్పుకో ఇది నీకు సంబంధం లేని విషయం" అన్నాడు.ప్రియ కోపంగా అర్జున్ ఎదురుగా వెళ్ళి "ఇది మా ఆడవాళ్ళ కి సంబంధించిన విషయం. ప్రతి రోజు ఎంత మంది ఆడవాళ్ళు ఇలాంటి problem face చేస్తూన్నారో తెలుసా నీకు? అంతెందుకు నాతోనే ఎంతో మంది, ఏదో ఒక time లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వెళ్ళి వాళ్ళందర్నీ కూడా కొట్టేస్తావా"? అర్జున్ కోపంగా చూస్తూ ఉన్నాడు. విషయం పెద్దది అయ్యేలా ఉంది అని గమనించిన ఆనందరావు అర్జున్ దగ్గరకి వెళ్ళి, "అర్జున్ ముందు ఇంట్లోకి పద ఏం చేయాలని ఆలోచిద్దాం" అన్నాడు.అర్జున్ కోపంగా ఆనందరావు వైపు కోపంగా చూస్తూ " బాబాయ్ తను చిన్నప్పట్నుంచి ఈ ఇంట్లో పెరిగిన