థ జాంబి ఎంపరర్ - 10

  • 261
  • 123

నేను నీకు చెప్పలేదు. కేవలం అతనికి తెలియాలి!" అని అంటాడు జగదీష్.వర్మకు ప్రభాకర్ ఇలా అంటున్నాడు: "సార్! మీ అల్లుడు, మీ కూతురు రంగనాథపురం లోనే ఉన్నారంట! తెలిసిందా మీకు?""ఏంటి? వాళ్ళు నాకు భయపడకుండా ఎక్కడికో పారిపోయి ఉంటారు అనుకున్నా! వాళ్ళు అంత ధైర్యంగా ఇక్కడే ఉన్నారా? ఎవడు వాడు? వీడికెంత ధైర్యం?" అని అనుకుంటూ వర్మ చిన్నగా పైకి లేచాడు.ప్రభాకర్: "సార్, నాకు ఎందుకు, నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ... అతడి తెలివితేటలు, అతని శక్తి చూస్తుంటే, మీ కొడుకుకు కావాల్సిన డీఎన్‌ఏ అతనిలో ఉండే అవకాశం ఉందనిపిస్తుంది. ఒకసారి అతన్ని పట్టుకొని చూద్దాం! ఉంటే చేసేద్దాం, లేదంటే విడిచిపెడదాం. అది మీ ఇష్టం!"ప్రభాకర్ మాటలతో వర్మ మెదడులో భయంకరమైన ఆలోచన మెరిసింది. "నాకు అది తెలియదు కానీ, వాడిని పట్టుకొచ్చేయండి! కుదిరితే చంపేయండి! లేదా నిజంగా డీఎన్‌ఏ తీసేటప్పుడు వాడే చచ్చిపోతాడు. కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.