అదంతా చూస్తున్న జగదీష్ 'అక్క మరి?' అని అమాయకంగా నటిస్తూ ఉంటే, వర్మ "అక్క లేదు, తొక్క లేదు! ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు! ఈ ఆడపిల్లలకు తమ మొగుడు అంటేనే ఇష్టం! వాళ్ళను కన్నా అమ్మానాన్నలు, పెంచిన అన్నయ్య... వీళ్ళెవ్వరూ అవసరం లేదు!" అని చిరాగ్గా, చికాకుగా ప్రాసెస్ పూర్తి చేసి సంతకం పెట్టేసాడు.అదే టైంలో, జగదీష్ గుండెలు పట్టుకుని కింద పడిపోయాడు. అతడి నోటి నుంచి నురుగు, కాళ్ళు చేతులు పడిపోవడం మొదలుపెట్టాయి. వెంటనే అతడిని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి, స్కానింగ్‌లు అవీ ఇవీ చెక్ చేసి ఒక రిపోర్ట్ పట్టుకొని నిలబడి ఉన్నాడు డాక్టర్.రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ – రంగనాధపురం – హాస్పిటల్ (కొనసాగింపు)డాక్టర్ రిపోర్ట్ పట్టుకొని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: "సార్, మీ అబ్బాయికి వచ్చింది రేర్ డిసీజ్! ఇది కేపీడీ అనే ఒక వింతైన వ్యాధి. అసలు దీనికి...