హేమంత్ (రౌద్ర తమ్ముడు) హాస్పిటల్‌లో..."నర్సు, ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను ఉండను. నా పేషెంట్స్‌ని అక్షితకు ఫార్వర్డ్ చేయండి. నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది," అన్నాడు డాక్టర్ హేమంత్."ఓకే డాక్టర్," అంది నర్సు."హేమంత్ తన ఫోన్ తీసుకుని, శాలిని నంబర్ ఎలాగైనా కనిపెట్టాలి. అతని మనసులో ఆలోచనలు మొదలవుతాయి."'శాలిని ఏం చేస్తుందో? ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే నా ప్రేమ విషయం చెప్పి ఉండాల్సింది. తను ఏమో ఫారిన్ వెళ్ళిపోయింది, కాంటాక్ట్‌లో కూడా లేదు. ఎలా అయినా తనని కనిపెట్టాలి. నాకు ఇప్పుడు తను చాలా అవసరం,' అనుకుంటూ ఉండగా, అతని ఫోన్ రింగ్ అయ్యింది. అతని అన్నయ్య రౌద్రవర్మ కాల్ చేస్తున్నాడు."హలో అన్నయ్య, చెప్పు," అన్నాడు హేమంత్."ఈరోజు వెళ్ళాలి గుర్తుందా? తొందరగా రా," రౌద్రవర్మ అడిగాడు."ఎందుకు లేదు అన్నయ్యా, వస్తా," అన్నాడు హేమంత్."సరే, బై," అని రౌద్రవర్మ ఫోన్ పెట్టేశాడు.నర్సు వచ్చింది. "డాక్టర్, పేషెంట్స్ వచ్చారు, పిలవనా?" అని అడిగింది."ఓకే,