గౌతమి గమనం

  • 252
  • 1
  • 78

గౌతమి గమనంకాకినాడ పోర్ట్ స్టేషన్ వచ్చే పోయే ప్రయాణికులతో హడావుడిగా ఉంది. కాకినాడ పోర్ట్ నుండి సికింద్రాబాద్ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ దేశంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.గౌతమి అంటే ఒక నది పేరు. ఆ పేరు వింటేనే ఒక ఆత్మీయత కనిపిస్తుంది. ఏదో మన సొంత వస్తువులా కాకినాడ ప్రయాణికులందరి అభిమానం సంపాదించుకుంది. ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్‌లో ఎక్కితే హాయిగా కాకినాడలో దింపే ఏకైక ట్రైన్ ఒకప్పుడు ఇదే.మానవుడు జీవితం సక్రమంగా నడవాలంటే కొన్ని నియమాలను చతుర్వేదాలు చెబుతున్నాయి. నా జీవితం సక్రమంగానే నడవాలంటే పట్టాలు దాటి ప్రయాణం చేయకూడదు. నిజంగా నేను మంచిదాన్ని. దూర ప్రాంతాల నుండి బంధువులందరిని తీసుకొచ్చి ఎన్నో వేల కుటుంబాల ఆనందానికి కారణం అవుతున్నాను.నేను రోజు ఎంతోమందిని గమ్యం చేర్చి వాళ్ల కలలు సాకారం చేస్తున్నాను. ఉద్యోగంలో చేరవలసిన తమ్ముణ్ణి, ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సిన చిన్న తమ్ముడిని, అత్తవారింటికి వెళ్తున్న కూతురిని, ముఖ్యమైన పనులు చేయడానికి