మన్నించు - 8

  • 324
  • 72

ప్రేమలో నిజాలు, అబద్ధాలు ఉండవు.. నిన్ను బాధపెట్టకూడదు అనే అబ్బదం చెప్పాను అంటారు.. అంటే ప్రేమకి నిజం విని నిలబడే శక్తి లేదు అనా?? ... అబ్బధాలతో కట్టిన అద్దాల మేడ కదా, ఒక్క నిజం రాయాలా దూసుకువచ్చినా, ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. విరిగిన మనసు .. నిజాలకు, అబ్బదాలకు మధ్య ప్రేమని దహించేస్తుంది. ********"ధీర కళ్ళు తుడుచుకో" దివ్య వైపు మీద నిమురుతూ చెప్పింది. అందరూ మళ్ళీ ఫ్రెషర్స్ ప్రోగ్రామ్లో మునిగిపోయారు. డాన్సెస్ స్టార్ట్ ఐపోయాయి. నీరు తెస్తానని వెళ్ళిన అజయ్ తిరిగి రాలేదు. దాహం ఆగిపోయింది. దివ్యని రెడీ చేయడానికి మేకప్ రూంకి నన్ను లాగుకొని వెళ్ళిపోయింది. దివ్య హడావుడిగా రెడీ అవుతుంది. ఇంకో రెండు పెర్ఫార్మెన్సుల తర్వాత తనదే. అజయ్ ప్రేమ విషయంలో నేను హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నాడు. నా వల్ల అవ్వకపోయినా దివ్య వల్ల అవుతుందేమో అనిపించింది. "దివ్య... మన అజయ్ ఉన్నాడు కదా.." ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతూ తన