భార్గవి ఆలోచిస్తూ ఉంటుంది. మాకు అలాంటి నమ్మకాలు లేవు అంటే.... మీ కూతురు మీద ఉన్న ప్రేమ ఇదేనా అంటారు. మీరు చెప్పినట్టు చేద్దామంటే... ఆరు నెలలు ఆగాలి. ఎలా ఏది మాట్లాడినా శిల్ప కు ఇబ్బంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ధనంజయ గారు మాట్లాడుతూ మీరు చెప్పినట్టు చేద్దాం అత్తయ్య గారు. కానీ... అప్పటివరకు శిల్ప ని ఎక్కడ ఉంచాలి అని అడుగుతారు. దానికి ఇందిరా గారు, మీరు కంగారు పడకండి శిల్ప ఇప్పటినుంచి మా అమ్మాయి. ఇక్కడే ఉంటుంది. కాకపోతే... విక్రమ్ గదిలో ఉండదు. శిల్ప సపరేట్ రూమ్ లో ఉంటుందని చెబుతారు. మేము పద్ధతులు, ఆచారాలలో దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము. నేను నా కోడలికి ఎలా అలవాటు చేశానో, అలాగే శిల్పకి అలవాటు చేస్తాం.. ఈ ఆరు నెలలు పూర్తయ్యేటప్పటికీ శిల్పకి అన్ని అలవాటు చేస్తాను. ఎంతైనా