పాణిగ్రహణం - 4

  • 303
  • 120

కోపంగా బయటికి వచ్చిన విక్రమ్ చూసిన ధనుంజయ గారు ఏమైంది అల్లుడుగారు అని అడుగుతుంటే... సీరియగా చూసి డ్రైవర్ని కారు తీయమని తను మాన్షన్ కి వెళ్ళిపోతాడు.    సత్యవతి,  భార్గవి శిల్ప దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతారు.  దానికి శిల్ప తెలియదమ్మా అని చెబుతుంది.సరే నువ్వు రెస్ట్ తీసుకో..  రేపు వెళ్లి అసలు ఏం జరిగిందో అని అల్లుడు గారిని అడుగుదామని భార్గవి ని శిల్ప కి తోడుగా ఉండమని చెప్పి, సత్యవతి బయటకు వస్తుంది.     ఏమైందమ్మా అని ధనుంజయ్ అడగగానే,  శిల్పకు ఏమీ తెలియదు అంటుంది.రేపు వెళ్లి మాట్లాడితే గాని,  విషయం ఏమిటో తెలియదు అని చెబుతుంది.విక్రమ్ తన మాన్షన్ లో  కారు దిగి సీరియస్గా లోపలికి వస్తాడు.  విక్రమ్ చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు.    ఏమైంది విక్రమ్..  ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, అక్కడ శిల్ప ని ఒంటరిగా వదిలేసి అని లలిత