ఉడైల్ ఘాటి

  • 318
  • 102

అది ఉత్తరఖాండ రాష్ట్రం లోని నైనితల్ నగరం. రాత్రి 10 గంటలు. ఒక బంగళాలొ "ఆమ్మా తాతయ్య ఎందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు?" అని 7 ఏళ్ళ తనూజ్ వాళ్ళ అమ్మ ఊర్మిళ ని అడిగాడు.ఇది విని నివ్వెర పోయిన ఊర్మిళ "అలా అని నీకు ఎవరు చెప్పారు..?"ఆవలిస్తు " తాతయ్యా చెప్పాడు ఇందాక తన గదికి వెళ్ళి బయట ఉద్యాన వనం (Garden) లొ మనం ఆడుకుందాం రా తాతయ్యా అని అడిగితె అలా చెప్పాడు.""ఎందుకు అమ్మా తాతయ్యా ఒక వారం రోజుల నుంచి బయటికి నాతొ ఆడుకోడానికి రావడం లేదు..?"కొడుకు అడిగిన దానికి ఏం చెప్పాలొ తెలియక "అలా ఏం లేదు రా తాతయ్యకు ఆరోగ్యం బాగోలేక రావడం లేదు అంతె. నువ్వు ఇంక పొడుకొ" అని చెప్పి నిద్రపుచ్చింది.పిల్లాడు నిద్రపోయాక ఊర్మిళ తన తండ్రి గదికి వెళ్ళింది. అప్పుడు నీరజ్ కళ్ళు మూసుకోని మంచం మీద పొడుకున్నాడు.