థ జాంబి ఎంపరర్ - 6

  • 252
  • 78

ఆదిత్య :"నా కుటుంబం బతికి ఉందని చెప్పావు, సంతోషం! కానీ నీ జీవిత చరిత్ర ఏంటో నీ కుటుంబానికి తెలియాలి కదా? నువ్వు ఏం చేశావో వాళ్ళకు తెలియాలి కదా?" అని ఆదిత్య అంటూ ఉండగా, వర్మ తన కర్రలో నుంచి ఒక కత్తి లాంటిది బయటకు తీస్తాడు. "చూడు! నువ్వు ఒక్క అడుగు ముందు వేసావంటే, ఈసారి ఈ శరీరం లేకుండా చేస్తా!" అని భయపెడుతున్నాడు ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)వర్మ ప్యాలెస్ – ప్రస్తుత సమయం (కొనసాగింపు)ఆదిత్య గిలగిల నవ్వుతూ, "ఏంటి? నువ్వు నా శరీరాన్ని నాశనం చేయగలవా? అవునా? అంత సత్తా ఉందా నీలో, ముసలి కుక్కా?" అని అంటూ రెండు అడుగులు వెనక్కి వేసి, తన వెనకాల ఉన్న పీఏ ప్రభాకర్‌ను చూస్తూ, "ఇప్పుడు వేటాడు చూద్దాం!" అని అన్నాడు.ప్రభాకర్‌ను చూసి, వర్మ "వీడు కూడా నీలాగే మారిపోయాడా? అయినా ఎవరినీ వదిలిపెట్టను!"