. ప్రభాకర్ మెడ నుంచి, ఆదిత్య గోర్ల నుంచి ప్రభాకర్ శరీరంలో నుంచి రక్తం పీల్చుకుంటున్నాడు. అతని శక్తి ఇంకా పెరిగినట్టు అనిపిస్తూ ఎరుపు కళ్ళు ఇంకా ఎర్రగా మారుతున్నాయి. అలాగే ఎక్కడో ఉన్న జాంబీలు కూడా ఇంకా ఎర్రగా కళ్ళు మారుతూ శరీర భాగాలు వికృతంగా మారుతూ ఉండగా అక్కడ సీన్ కట్ అవుతుంది.ప్రభాకర్‌ను పట్టుకొని గట్టిగా అరుస్తూ, ఆదిత్య ఇలా అన్నాడు: "ఇప్పుడే స్టార్ట్ అయిందిరా నా 20 ఏళ్ళ ఆకలి! మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే శక్తిగా మారబోతుంది. మీరు చేసిన చిన్న తప్పు ఇప్పుడు మీ ప్రాణాలకు!" అంటూ, ఒక్క నొక్కడంతో అతను పూర్తిగా భగ్గుమని అంటుకున్న అగ్గిపుల్లలా బూడిదలా మారిపోయాడు!అంతే, ఆదిత్య దూరంగా వచ్చి చేతులు దులుపుకొని, తన ఎర్రటి కళ్ళతో చూడగానే ఆ బూడిద మరోసారి మానవ రూపం ధరించి ఒక జాంబీ ప్రభాకర్‌గా మారిపోయాడు. అతని కళ్ళల్లో ఎరుపు. ఎవరినో పట్టుకొని