అవును నాకు తెలుసు. ఓడిపోవడం కొత్త కాదు. గెలవడం కొత్త. ఈ గెలుపును ఆనందించడం కొత్త. ఈ గెలుపు కోసం ఏదైనా చేయడానికి ఇప్పుడు నేను రెడీ. నాకు..." అని ఆగాడు."నాకు గెలుపు ఒక్కటే కనిపిస్తుంది. నేను అనుకున్నది మాత్రమే నా ముందు కనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఓడిపోలేదు, నాకు అర్థమైనంతవరకు, నేను ఇష్టపడినంతవరకు అది నాకు స్వేచ్ఛగా వస్తుంది. తెలియని దాని గురించి నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. అది ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది మంచిదా, చెడ్డదా, అవసరమా, అనవసరమా అన్న దానిపైనే నేను వర్క్0 చేస్తాను. ఇప్పుడు నాకు ఇది న్యాయంగా అనిపిస్తుంది. నువ్వు చేసేది అన్యాయం. నీకు ఎదురుపడడం న్యాయం. న్యాయం ముందు ఎవరైనా తగ్గి ఉండాల్సిందే," అని రుద్ర మాట్లాడటం మొదలుపెట్టాడు.ఆ మాటలకు చుట్టూ ఉన్న ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. "రుద్ర! రుద్ర!" అనే పేరు గాలిలో మార్మోగుతూ నీళ్లలో కూడా అదే పేరు వినిపిస్తోంది.