ప్రేమలేఖ..? - 4

  • 264
  • 99

20 డేస్ ఇక్కడే ఉంటాను. అనడంతో ఉత్సాహంగా చూసింది లీల. బట్ అప్పటి వరకు వెయిట్ చేసే ఓపిక లేదు మేడం ప్లీజ్ ఈ ఫ్రైడే గుడికి వేసుకొస్తావా అని రిక్వెస్ట్ గా అడుగుతున్న ఆనంద్ అల్లరి కి నవ్వుతూ సరే అంది.ఒకే ఊరిలో ఉండే ఇద్దరు ఒకే దారిన.. నెలల తర్వాత కలిసిన ఏడబాటుని కబుర్లతో దూరం చేసుకుంటూ కలిసి వెళ్తున్నారు. ఇంకా కొన్ని నిమిషాల్లో ఊరిలోకి వెళ్తాను అనగా వాళ్లని ఆటోలో వస్తున్న ఆండాలమ్మ గారు చూసి ఆటో ఆపి మరి ఎదురు వచ్చి నిలబడ్డారు. ఆవిడతో పాటు బసవయ్య గారు కూడా ఉన్నారు, కొద్దిరోజుల నుంచి పొడి దగ్గుతో బాధపడుతున్న ఆవిడని హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నారు.బామ్మగారిని చూడడమే భయపడ్డా లీలా డ్రెస్ కవర్ నలిపేస్తూ ఆనంద్ నుంచి ఒక అడుగు దూరం జరిగింది. తండ్రి కన్న ఎక్కువగా బామ్మ గారికి భయపడుతుంది లీలా ఎందుకంటే ఆవిడ మాట కాదని ఎవ్వరూ