తనువున ప్రాణమై.... - 25

  • 429
  • 105

ఆగమనం.....చెవులకు వినిపిస్తున్న గట్టి మేళం కానీ...చుట్టూ జరుగుతున్న వేడుక కానీ...అతని గమనించలేకపోయాడు!!అంతగా తనని తాను మరిచిపోయి... పొట్టి దాని ఆలోచనలు మునిగిపోయాడు!!పొట్టి దానిని మనసులో 100 తిట్టుకుంటూ... తన చెల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ...ఎందుకో, ఏమిటో, తెలియని ఒక గందరగోళంతో... వధూవరుల మీద అక్షింతలు వేస్తాడు!!ఏంటి తమ్ముడు, ఇక్కడ కూర్చున్నావు??అందరూ మండపం మీద ఉంటే నువ్వు...ఒక్కడివే, ఇక్కడ ఏం చేస్తున్నావు??పొట్టిదాని ఆలోచనతో బుర్ర హీటెక్కి... దేనిమీద కాన్సెంట్రేట్ చేయలేక... అంతక ముందు పొట్టిది కూర్చున్న, ఆ కార్నర్ లోకి వచ్చి సెటిల్ అయ్యాడు!!సైలెంట్ గా పక్కన కూర్చున్న అక్క ని ఒక క్షణం చూసి, దిగులుగా మండపం వైపు తల తిప్పేస్తాడు!! అందరి మధ్య సంతోషంగా వరమాలలు మార్చుకుంటున్న, వధూవరులను ఫోటోగ్రాఫర్స్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫొటోస్ తీస్తూ ఉంటే, మిగిలిన వాళ్ళంతా... వాళ్లని చూసి నవ్వుకుంటూ, సరదాగా ఆటపట్టిస్తూ, ఈ యాంగిల్ కాదు ఆ యాంగిల్ అని సలహాలు ఇస్తూ, అల్లరి చెయ్యొద్దు అని పెద్దవాళ్ళు వాళ్లని ఖండిస్తూ.....