ఆగమనం.....సిక్స్ ఫీట్ నువ్వు చాలా బాగుంటావు!! మండపం మీద లైటింగ్ లో ఇంకా బాగున్నావు!! ఇప్పుడు నా కోసమే నా దగ్గరికి వచ్చావు... చూడు చాలా చాలా బాగున్నావు!! నాకు పిచ్చెక్కిచ్చేస్తున్నావు, సిక్స్ ఫీట్!!మత్తుగా, మిరిమిట్లు గోలుపుతున్న కళ్ళతో, క్యూట్ గా మాట్లాడుతున్న పొట్టిదాని మాటలకి సిక్స్ ఫీట్ ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు!!ఈ వాగుడే కాస్త తగ్గించు పొట్టి!!అందరూ డిన్నర్ కి వెళ్తున్నారు... నువ్వు కూడా వెళ్ళు! చాలా కష్టంగా నీ ఆకలిని,ఆపుకొని పెళ్లి చూడడానికి వచ్చావు, కదా??పొట్టిది, తినకుండా వదిలేసి వచ్చినందుకు...అబ్బాయి గారికి హ్యాపీగానే ఉంది. కానీ....తన ఫీలింగ్ ని, బయటపడనీయకుండా...నార్మల్ గా మాట్లాడుతున్నాడు..!!అయ్యో లేదు సిక్స్ ఫీట్!! నాకు అసలు ఆకలి గాని లేదు!! అది కాక నేను పెళ్లి చూడడానికి రాలేదు!! అక్కడ నిన్ను ఉండమన్నాను!! నువ్వు ఉండును అన్నావు!!సరే, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా!! అందుకే, నేనే ఇక్కడికి వచ్చాను!! నిన్ను చూడడానికే వచ్చాను సిక్స్ ఫీట్!! నాకోసం నువ్వు అక్కడికి, ఇక్కడికి... తిరిగి టెన్షన్ పడడం నాకు