కొద్దిసేపటికే విశ్వ అక్కడున్నాడు. జాన్ తన చేతిలో ఉన్న ఆయుధాలను చూస్తూ, "ఇది భూమికి కొత్త రాజు రాబోతున్నాడు. మళ్ళీ రాజకీయం మొదలవుతుంది, రాజులు, వాళ్ళ పిల్లలు," అని గట్టిగా నవ్వుతూ "నేనే రాజు," అని అంటూ అక్కడ కట్ అయింది.వారం రోజుల తర్వాత, నెమ్మదిగా అక్కడ చెట్లు పెరగడం, పచ్చదనం పెరగడం, సూర్యకిరణాల వల్ల పైనుంచి వచ్చే వేడి గాలులతో అక్కడ ఉన్న చెట్లు, బుట్టలు, జీవులకు ఎక్కువ ఎనర్జీ సేవ్ అవుతూ "ఆర్" అనే నగరం ఒక్కసారిగా అన్ని నగరాల కంటే అద్భుతంగా మారిపోతోంది. అక్కడున్న స్తంభం కూడా మంచి వెలుగుతో బలంగా, ఈసారి ఎటువంటి తడబాటు లేని యువకుడిలా గట్టిగా నిలబడి అక్కడ రక్షణ కల్పించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.అక్కడున్న వాళ్ళు, "రుద్రమనుల రాజ్యానికి శక్తి అందబోతోంది. మన రాజ్యానికి వచ్చిన మానవుడి వల్లే ఇది జరుగుతుందా? అంటే రుద్ర వల్లే ఇదంతా జరుగుతుందా?" అని ప్రతి ఒక్కరూ