అరవై ఏళ్లకి పెళ్లి"మావయ్య గారు పంచకట్టుకోవడం అయిందా! అని అడిగింది అరవైఏళ్ల పరమేశ్వరరావుని హాలు లోంచి కోడలు సుజాత. "మీకు పంచికట్టుకోవడం అయితే నేను వచ్చి నుదుట నామం,కళ్ళకి కాటుక బుగ్గన చుక్క పెడతాను అoది సుజాత.అలాగేనమ్మా అన్నాడు! పరమేశ్వరరావు. ఇంతలో పరమేశ్వరావుకి కూతురు రమ్య గొంతు గట్టిగా వినిపించింది మేడ మీద నుంచి. " అమ్మ తయారయ్యావా! పంతులుగారు పిలుస్తున్నారు అని అంది రమ్య.అయిపోయిందమ్మా! అని సమాధానం ఇచ్చింది పరమేశ్వర రావు భార్య రాధిక. ఎంత బాగున్నావ్ అమ్మ పెళ్లి కూతురు ముస్తాబులో నా దిష్టి తగిలేలా ఉంది అని తల్లిని చూస్తూ రమ్య. పద పద అంటూ తల్లి చెయ్యిని పట్టుకుని మేడ దిగి వస్తుంటే నిజంగానే సుజాత కొత్త పెళ్ళికూతురు అనిపించింది హాల్లో ఉన్న బంధువులకి స్నేహితులకి.అందమైన చిలకాకుపచ్చ ఎర్ర అంచు బోర్డర్ ఉన్న పట్టుచీర, రంగు వేసిన జుట్టు, కాళ్ళకి చేతులకి గోరింటాకు, నుదుటన పెళ్లి బొట్టు,