ఇదంతా గమనిస్తున్న వృద్ధ సలీం, "ఇక ఇతని వల్ల కాదు. అసలు ఇతన్ని ఎలా ఎన్నుకున్నారు? ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు?" అని ఆలోచిస్తూ ఆలోచనల్లో పడ్డాడు. నిస్సహాయంగా, "సరే, ఇక రేపటి నుంచి నువ్వు క్లాసులకు వెళ్తావులే. అప్పటికెనా ధ్యానం లేకుండా అందరినీ చూస్తూ నేర్చుకుంటారు," అని అంటూ వెళ్లిపోతాడు.అదే సమయంలో, అక్షర అక్కడికి చేరుకుంటుంది. అక్షర రుద్రను చూస్తూ దూరంగా నిలబడి ఉంటుంది. తన తాతయ్య దగ్గర కూర్చుని ఉంటుంది అక్షర. తాతయ్య చిన్నగా నవ్వుతూ, "ఏంటమ్మా, నిజంగా ఇతను రాజుగా మారగలడా?" అని అడుగుతాడు."నీకు తెలియనిదేముంది తాతయ్య? రుద్ర ఎప్పటికీ రాజు కాదు. ఎందుకంటే ఈ రాజ్యానికి రాజు ఎప్పుడో ఉన్నాడు, ఎప్పుడో పుట్టాడు. కేవలం సరిగా లేడు," అని చెప్పడంతో తాతయ్య, "తెలుసుకున్నావే నా మనవరాలు అనిపించుకున్నావు," అని అంటూ చిన్నగా భుజం మీద తడుతూ, "సరే తల్లీ, ఇక నేను పడుకుంటాను. నీ ధ్యానం