శేషధారివెంకటేశ - 2

  • 198
  • 60

అంజలి ఆ తాళం చూసి అసలు ఇది తాతయ్య ఎందుకు నాకు ఇచ్చారు నాకు ఈ తాళం తో ఏంటి ఉపోయోగం? పైగా ఇంట్లో వారు ఎవరికీ కనపడకుండా ఉంచామన్నారు అంతగా ఇందులో ఎం రహస్యం ఉంది? ఎందుకు పనికి వస్తుంది ఇది? ఇంతలో బయట గద్ద అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అంజలి బయటికి వెళ్లి చూడగా వాళ్ళ నానమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది." గుడి ఏమో మోసేసి ఉంది, గరుడుడు ఏమో అరుస్తున్నాడు, ఏదో జరగబోతుంది.కానీ, అర్థం కాదు".అంజలి: ఏంటి? గుడి మూయడానికి గద్ద అరవడానికి సంబంధం ఎం జరగబోతుంది?నానమ్మ: పోయిన సరి 25 ఏళ్ళ ముందు కూడా ఇలానే జరిగింది అప్పడు ఏ మీ తాతయ్య చనిపోయాడు. అప్పటి నుంచి మళ్ళీ అరవడం ఇదే మొదటి సారి.ఆలా అరుస్తున్న గద్ద అనుకోకుండా అంజలి వైపు వస్తుంది. భయం తో అంజలి తన చేతిలో ఉన్న తాళం కింద పడేస్తుంది.