మన్నించు - 7

  • 324
  • 81

ఇష్టాల కన్నా అయిష్టలనే ఎక్కువ గుర్తుపెట్టుకునే ప్రపంచంలో పుట్టాం కదా... ప్రేమలో కలిగిన తీపి జ్ఞాపకాల కన్నా, ఎదురైన కష్టాలు, బాధలు, ఏడుపులే ఎక్కువ గుర్తుంచుకుంటాం. అన్ని బాగున్నపుడు ఉన్న ప్రేమ... పరిస్థితులు బాలేనప్పుడు భారంగా మారిపోతుంది. ఆనందాన్ని ఎంతైనా మోయగలిగే గుండె, బాధని కొలతలలో లెక్కెసుకొని మరీ మోయనంటుంది ఎందుకో..***************అమ్మ ఒకసారి ఫోన్ ఇస్తావా.. మిత్ర ఫ్రెషర్స్ డే గురించి మాట్లాడాలి ఇంటికి వెళ్ళక కాల్ చేయ్ అనింది. అమ్మకి ఏదో ఒక కారణం చెప్పి ఫోన్ తీసుకొని డాబా మీదకి ఎక్కేసాను. సిడ్ నంబర్కి డైల్ చేశాను. రింగ్...రింగ్..."హ...లో...." నమ్మలేనట్లుగా అన్నాడు. "హెల్లో సిడ్... ఇప్పుడు చెప్పు.. మాట్లాడాలి అన్నావ్" క్యాస్యువల్గా అడిగాను."ధీర.. నమ్మలేకపోతున్న... నువ్వు కాల్ చేసావా" సందేహంగా అడిగాడు. "నా కోసం నువ్వు చాలా కష్టపడి తోడు వెతికావ్ గా... నువ్వు నేను అనుకున్నంత ఎదవ్వి కాదు" నవ్వేశా ఫోన్ లో"నీ నవ్వు బలే ఉంటుంది ధీర.... నీలానే చాలా అందంగా ఉంటుంది.