నిజం వెనకాల ఆలయం - 3

  • 273
  • 102

శాంభవుడు మీరాను అంతం చేయాలనుకుంటున్నాడని మీరాకు తెలుసు. కానీ ఎందుకు అనేది ఆమెకు అర్థం కాదు. వాడి గురించి నిజం తెలుసుకోవాలనిపించినప్పుడు, తన దగ్గర ఉన్న పుస్తకంలో ఆ శక్తి గురించి ఏదైనా సమాచారం ఉండవచ్చని భావించి, ఆమె ఆ పుస్తకాన్ని తెరిస్తుంది. అప్పుడు, ఆమెకు శాంభవుడి గతం ఇలా కనపడుతుంది…అధ్యాయం 8 – మరో శక్తిఫ్లాష్‌బ్యాక్  [400 సంవత్సరాల క్రితం]యువ రాణి అమృత తండ్రి శ్రీ రాజా కేశవరాయుడు భవనంలో, మంత్రిగా ఉన్న శాంభవుడు—ఆ భవనంలోనే అత్యంత తెలివైనవాడు, శక్తిశాలి వాడు. చాలా సంవత్సరాలుగా రాజుగా స్థానం పొంది, మొత్తం ఊరిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతని లక్ష్యానికి అడ్డుగా నిలిచింది ఒక్క యువ రాణి అమృత మాత్రమే. అందరికీ తెలిసింది శాంభవుడి తెలివే, కానీ ఎవరికీ తెలియనిది—అతడు నిజానికి ఒక మాంత్రికుడని, అతని కంటు ఒక చీకటి కోణంఉందని. ఎవరైనా అతడి నిజాన్ని తెలుసుకుంటే, వారిని