ఇత్తడి సామాను

  • 270
  • 81

ఇత్తడి సామానుఉదయం 6:00 గంటలు అయింది. రాజమ్మ గారు స్నానం చేసి పూజ పూర్తి చేసుకుని హాల్లో టీవీలో వార్తలు చూస్తున్న పెద్ద కొడుకు రఘు దగ్గరకొచ్చి "ఒరేయ్ రఘు ఒక పెద్ద వ్యాన్ తీసుకురా అలాగే ఇద్దరు మనుషుల్ని కూడా పురమాయించు. పైన ఉన్న ఇత్తడి సామాను అంతా మనం రాజమండ్రి పట్టుకెళ్ళి అమ్మేద్దాం అంటూ తల్లి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయాడు రఘు. "అమ్మలో ఇంత మార్పు వచ్చింది ఏమిటా అని ఆలోచించసాగాడు. ఒరేయ్ నా మాటలు వింటున్నావా లేదా అంటూ రెండోసారి రెట్టించేసరికి అలాగే అమ్మ అంటూ స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్ళిపోయాడు.రఘు రాజమ్మ గారి పెద్ద కొడుకు. రాజమ్మ గారికి నలుగురు కూతుళ్లు నలుగురు కొడుకులు పెళ్లిళ్లు అయిపోయి అంతా హైదరాబాదులోనే సెటిలైపోయారు. రాజమ్మ గారు మాత్రం ఆ ఊరు వదలలేదు. లంకంత కొంప. చేతినిండా పనివాళ్ళు. నెలకొకసారి రఘు హైదరాబాద్ నుంచి వచ్చి రాజమ్మ గారి