అమ్మ మనసు

అమ్మ మనసుఅక్షరాభ్యాసం అయిపోయింది కదా! ఎల్లుండి సప్తమి శుక్రవారం ఆరోజు బాగుంది చంటి దాన్ని ఆ రోజు నుంచి స్కూలుకి పంపించు అంటూ తండ్రి చెప్పిన మాటలకు సరేనని చెప్పి ఫోన్ పెట్టేసింది శ్వేత. శుక్రవారం అంటే ఇంక మూడు రోజులే ఉంది. పుస్తకాలు బ్యాగు బూట్లు స్కూల్ యూనిఫారం కొనాలి అంటూ హడావుడి పడిపోతుంది శ్వేత తన కూతురు రమ్యని మొదటిసారిగా స్కూల్లో జాయిన్ చేయడానికి. సాయంత్రం భర్త రాగానే బజారుకెళ్లి ఇవన్నీ కొనుక్కుని రావాలని అనుకుంది. రమ్య పుట్టి అప్పుడే మూడేళ్లు అయిపోయింది. అప్పుడే స్కూల్ కి వెళ్లే పెద్ద పిల్ల అయిపోయింది. ఇన్నాళ్లు చంకెక్కి కూర్చుని శ్వేత నీ ఏ పని చేసుకోనివ్వకుండా మారం చేసే రమ్య స్కూల్ కి వెళ్ళిపోతుంది అనుకుంటే శ్వేతకి ఒక్కసారి ఎందుకో బెంగగా అనిపించింది. పుట్టిన దగ్గరనుంచి ఒక్కరోజు కూడా అమ్మ చంక వదలని రమ్య ఇప్పుడు స్కూల్ కి వెళ్ళిపోతుందంటే ఏదోలా