తరువు కోసం తనువుఒరేయ్ రామయ్య నువ్వు గుడిలో నాటిన మామిడి మొక్క ఈ ఏడాది ముద్దుగా కాపు కాసింది రా! అందుకే ఈ పండుని నీకు చూపించిన తర్వాతే దేవుడికి నైవేద్యం పెడదామని తీసుకొచ్చానంటూ చేతిలో మామిడిపండ్ల పళ్ళెం పట్టుకుని మొక్కలకు నీళ్లు పోస్తున్న రామయ్య దగ్గరికి వచ్చాడు గుడి పూజారి కృష్ణమాచారి. దానికి బదులుగా రామయ్య నవ్వి నాకెందుకండీ! అయ్యగారు ఆ దేవుడికి నైవేద్యం పెట్టండి. ఆయన తోటలోనివే కదా ఇవన్నీ. కేవలం నేను ప్రతిరోజు కాసిన్ని నీళ్లు పోసాను అంతే కదా అయ్యగారు అన్నాడు రామయ్య. లేదురా ఆ మొక్కల పాలిట నువ్వు దేవుడివే. ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్రమ అనుకోకుండా నీళ్లు పోసి పెంచి వాటి సంరక్షణ చూస్తావు కదా! అన్నాడు పూజారి కృష్ణమాచారి.అలా ప్రతిరోజు ఎంతోమంది "నువ్వు మా పెళ్ళిలో కానుకగా ఇచ్చిన మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి కాపుకు వచ్చాయి బాబాయ్ అంటూ చెప్పే ఆ