దారి (దయ్యాల) – కథ“అరేయ్… మా ఏరియామొత్తం ఎ.టి.ఎంలు తిరిగారా ఒక్కదాంట్లో డబ్బుల్లేవు… అక్కడ ఏమైనా వస్తున్నాయారా?”అడిగాను నా ఫ్రెండ్ ని. వాడు ఓ ఎ.టి.ఎంఅడ్రస్ చెప్పాడు. అక్కడ ఎప్పుడూ డబ్బులు ఉంటాయన్నాడు. ఆటోలో ఆ అడ్రెస్స్ కివెళ్లాను. ఎ.టి.ఎంలో డబ్బులు డ్రా చేసుకుని అలా రోడ్డు మీద వెళుతున్నాను. రోడ్డుకిఇరువైపులా పెద్ద పెద్ద గేట్లు, ప్రహరీ గోడలతో విశాలమైన స్థలాల్లో కోటల్లా ఉన్నాయిబంగళాలు. ఉన్నట్టుండి ఓబంగాళాలో నుండి పెద్ద అరుపు వినపడింది. ఆ బంగాళా దగ్గరికి వెళ్లాను. గేటు తెరిచిఉంది. గేటు బయటే నిలబడి లోపలికి చూశా. ఆ ఇంటి గుమ్మం కూడా తెరిచే ఉంది. గుమ్మంలోనుండి ధోతి కట్టుకున్న ఓ ముసలాయన బయటికి వచ్చాడు గాభరాగా. బహుహా ఆయనే అరిచిఉంటాడు. నన్ను చూసి- “బాబు…” అంటూపరుగెత్తుకొచ్చాడు. నేను ‘ఏంట’న్నట్టు చూసాను. దగ్గరికి వచ్చి “మాఅయ్యగారికి గుండెపోటు వచ్చింది