గురు దక్షిణ

  • 765
  • 1
  • 171

గురుదక్షిణసాయంకాలం నాలుగు గంటలు అయింది. వీధి అరుగు మీద కూర్చుని విద్యార్థులకి వేదం బోధిస్తున్న రామకృష్ణ శాస్త్రి గారికి ఒక వయసు మళ్ళిన వ్యక్తి ఒక చేత్తో సంచి ,మరొక చేత్తో పది సంవత్సరములు ఉన్న కుర్రాడు చెయ్యి పట్టుకుని తన ఇంటి ముందు ఆగడం గమనించాడు." నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం అమలాపురం దగ్గర ఉన్న రంగాపురం. వీడు మా అబ్బాయి నారాయణ శాస్త్రి. వీడు ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఇకముందు స్మార్త విద్య నేర్పిద్దామని మా సంకల్పం.. మీ గురించి మా గ్రామంలో ఎవరో చెబితే విని ఎంతో ఆశతో వచ్చాను అంటూ చెప్పు కుంటూ వచ్చాడా పెద్దమనిషి.మీరు నిలబడే ఉన్నారు! . ముందు మీరు ఇలా కూర్చోండి అంటూ శాస్త్రి గారు ఆ వచ్చిన ఆయనకి అరుగు మీదనున్న చాప చూపించి ఆ తర్వాత అతిధి మర్యాదలు చేసి నాకు విద్య నేర్పడానికి నాకేమీ