ఉగాది పండుగ

  • 249
  • 60

“ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది ఈ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. యుగం అంటే యోగమని మనిషి బ్రతుకు కాలంలో ముడిపడి ఉండటమే యోగం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. ఇది వసంతకాలంలో వస్తుంది. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, కేరళ, బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ విశేషంగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్ర లేచి, తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, అలంకరించి, ఇంటి ముందట ముగ్గులు