అంతులేని ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ

  • 78

ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతని కుమారుడు ఉద్యోగ నిమిత్తం నగరంలో నివసించేవాడు. తన కుమారుడుని చూసి చాలా రోజులయ్యింది. ఒకరోజు రామయ్య తన కుమారుడుని కలవాలనుకున్నాడు. తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కుమారుడి దగ్గరి నుండి ఏ అడ్రస్ నుండి లెటర్స్ వస్తాయో అక్కడికి వెళ్ళాడు. “కాలింగ్ బెల్ కొట్టి తన కుమారుడే తలుపు తీస్తాడని ఆతృతగా వేచి చూస్తున్నాడు”. కానీ అక్కడ తన కుమారుడు తలుపు తెరువలేడు..ఎవరో ఒకతను వచ్చాడు. అపుడు రామయ్య తన కుమారుడు మోహన్ ఎక్కడ అని అడిగాడు. ఆ వ్యక్తి మోహన్ కొన్ని రోజుల క్రితమే ఈ రూమ్ కాళీ చేసి వెళ్లిపోయాడని చెప్పాడు. రామయ్య చాలా నిరాశ చెందాడు. ఇంత” పెద్ద మహానగరంలో తన కొడుకుని ఎక్కడని వెతకాలి అని చింతించాడు”.ఆ మార్గం గుండా నడుస్తూ అందరిని తన కుమారుడు మోహన్ ఎక్కడ ఉంటున్నాడో తెలుసా  అని  ఆరాదీస్తూ వెళ్ళసాగాడు.