అమీ తుమా కి భాలో భాషి యానివర్శరీ

  • 282
  • 1
  • 81

కొంతమంది మన జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతే, మరి కొందరు గుణపాఠాలుగా మిగిలిపోతారు. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే అబ్బాయి నా జీవితం లో ఎలా మారాడో ఇప్పుడే చెప్పలేను గాని అతడి పరిచయం ఎలా జరిగిందో చెప్తాను.నేను ఒక టిపికల్ IT employee ని. ఈ రంగం లో లేని వాళ్లకి ఇదొక అందమైన అద్దాల మేడలా అనిపిస్తే ఇందులో ఉన్న నా లాంటి వాళ్లకి ఇక్కడ పని చేయడం ఒక పీడలా అనిపిస్తుంది.(మేడ పీడ.. అడ్డెడ్డెడ్డే రాస్కో రా సాంబ). ఒకర్ని ఒక చీకటి గుహలో బంధిస్తే ప్రాణం ఎలా విలవిల్లాడుతుందో అంత కంటే ఎక్కువ బాధ పడుతున్న నాకు ఓ రోజు పున్నమి చంద్రుడు లాంటి ఒక అందమైన అబ్బాయి కనిపించాడు. (మాంచి మెలోడీ ఒకటి background లో వేసుకోండి).పోలికకి తగ్గట్టే చందమామలా తెల్లగా ఉంటాడు, మరీ ఎక్కువ చేసి చెప్పట్లేదు కానీ, ఆరడుగుల అందగాడు,