తల్లి నిరీక్షణ

 బంధం   తల్లి   ఎదురుచూపు వృద్దాప్యం మమకారంరాత్రి భోజనం ముగించి ఆరు బయట పడుకున్న శాంతమ్మ ఫోన్ రింగ్ అవుతుండడంతో లోపలికి వచ్చి ఫోన్ అందుకుంది. అవతలి వైపు గొంతు వినగానే అప్రయత్నంగా శాంతమ్మ కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. అది తన కొడుకు విజయ్ గొంతు. ఎలా వున్నావ్ చిన్నా ఆరు నెలలు దాటింది నీ గొంతు విని అంది శాంతమ్మ ఆవేదన, వాత్సల్యం కలగలిసిన స్వరంతో. బాగానే వున్నానమ్మ కాస్త పని ఒత్తిడిలో వుండి ఫోన్ చేయలేక పోయాను అంటూ సమాధానమిచ్చాడు విజయ్ తన తల్లి అడిగిన ప్రశ్నలకి. నువ్వు ఎలా వున్నవమ్మా, నీ ఆరోగ్యం ఎలా వుంది అని అడుగుటతాడని ఆశగా ఎదురుచూసిన శాంతమ్మకు నిరాశే మిగిలింది. చెప్పదలుచుకున్న విషయాన్ని తన సమయం వృధా కాకుండా రెండు ముక్కల్లో చెప్పేసి తనకి ‘అనవసరమైన’ విషయాలను ప్రస్తావించకుండా ఫోన్ పెట్టేయడం అలవాటే విజయ్ కి. తన క్షేమ సమాచారం తెలుసుకోవడం కూడా ఆ